సైన్స్ క్విజ్ పోటీ సోనిక్ 2017 లో ప్రతిభను చాటిన విద్యార్థినీ విద్యార్థులు
- September 10, 2017
మస్కట్ : అంతర పాఠశాలల సైన్స్ క్విజ్ పోటీలను ఇండియన్ స్కూల్ వాడి కబీర్ (ఐ ఎస్ డబ్ల్యూ కె) డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సోనిక్ 2017 పేరిట ఇటీవల నిర్వహించింది. ఒక అద్భుతమైన ఇంటర్ స్కూల్ సైన్స్ క్విజ్ పోటీ కార్యక్రమంలో ఇండియన్ స్కూల్స్ - మస్కట్, ఘుబ్ర, దర్సైట్, నిజ్వా మరియు ములాదా వంటి ఐదు పాఠశాలలు ఈ క్విజ్ కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఈ క్విజ్ లో శాస్త్రవేత్తలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ, న్యూక్లియర్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు అంతరిక్ష శాస్త్రం, శాస్త్రవేత్తల చిత్రాలు,రేడియో ధార్మిక చిహ్నాల పరీక్షలు, సేంద్రీయ నిర్మాణాలపై ఆధారిత ప్రశ్నలు, శాస్త్రవేత్తల పరిశోధనల ఆధారంగా వివిధ ప్రశ్నలు ఐదు విభాగాలలో పోటీలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమంలో యువ పారిశ్రామికవేత్త, ఒక క్విజ్ ఔత్సాహికుడు, క్విజ్ శిక్షణ ఇవ్వరంలో సుప్రసిద్ధుడు, పట్టణంలోని ఒక ప్రసిద్ధ క్విజ్ మాస్టర్ హాలా జమాల్ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. క్లిష్టతతో కూడిన ప్రశ్నలకు గొప్ప వేగం మరియు ఖచ్చితత్వంతో కూడిన సమాధానం ఇచ్చిన విద్యార్థులు ఉన్నారు ప్రశ్నలు. క్విజ్ మాస్టర్ విలియం డోనాల్డ్ సీమాంతికి ఈ కధనాన్ని ప్రయోగాత్మక పద్ధతిలో నిర్వహించారు. డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్, జెనిఫర్ రాబిన్సన్ క్విజ్ పోటీలో విజేతలను ప్రకటించారు. మొదటి స్థానంలో ఇండియన్ స్కూల్ మస్కట్ ఉండగా ఆ పాఠశాల విద్యార్థులు ఆన్విక్ సింగ్ (క్లాస్ 11) అలివా దాస్ (క్లాస్ 12) మొదటి స్థానం విజేతలుగా నిలిచేరు. ఆ తర్వాత రెండవ స్థానంలోఇండియన్ స్కూల్ ఘుబ్ర నిలిచింది ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు అనీష్ కుమార్ బద్రీ (క్లాస్ 11), వైష్ణవ్ షబు నాయర్ (క్లాస్ 12) రెండో స్థానంలో విజేతలుగా ఉన్నారు. ఇక మూడవ స్థానంలో ఇండియన్ స్కూల్ వాడి కబీర్ నిలిచింది. ఆ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఆయుష్మాన్ రాణా (క్లాస్ 11) మరియు వైదేహీ ఠాకూర్ (క్లాస్ 12)లు మూడవ స్థానంలో విజేతలుగా నిలిచేరు. ఈ అంతర పాఠశాలల సైన్స్ క్విజ్ సోనిక్ 2017 పోటీలలో మూడు స్థానాలలో గెలుపొందిన విద్యార్ధేనీ విద్యార్థులను ప్రిన్సిపల్ మరియు వైస్ ప్రిన్సిపాల్ హృదయపూర్వకంగా అభినందించారు. ఈ తరహా క్విజ్ కార్యక్రమాలు తరచుగా నిర్వహించబడాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తద్వారా భారతీయ పాఠశాలల విద్యార్థులు తమ తమ ప్రతిభను మరియు మేధా నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇటువంటి అవకాశాలను కల్పించనున్నట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







