పొల్లాచ్చిలో బెల్లంకొండ శ్రీనివాస్ పోరాటాలు
- September 12, 2017
బె ల్లంకొండ శ్రీనివాస్ కథానాయకుడిగా అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీవాస్ దర్శకుడు. పూజా హెగ్డే కథానాయిక. అభిషేక్ నామా నిర్మాత. ఇటీవల పొల్లాచ్చిలో పీటర్ హెయిన్స్ ఆధ్వర్వంలో పోరాట ఘట్టాల్ని తెరకెక్కించారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ''బలమైన కథ, కథనాలతో రూపొందుతున్న చిత్రమిది. సాంకేతికంగానూ ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నాం. పొల్లాచ్చిలో 15 రోజుల పాటు యాక్షన్ సన్నివేశాల్ని తెరకెక్కించాం. పీటర్ హెయిన్స్ సరికొత్తగా డిజైన్ చేశారు.
అందులో బెల్లంకొండ శ్రీనివాస్ ఎలాంటి డూప్ లేకుండా నటించారు. యువతరంతో పాటు, కుటుంబ ప్రేక్షకులకూ నచ్చే చిత్రం అవుతుంది. ఈ సినిమాతో శ్రీనివాస్‌కి సరికొత్త ఇమేజ్ ఏర్పడుతుంద''న్నారు. జగపతిబాబు, శరత్‌కుమార్, మీనా, వెన్నెల కిషోర్, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురుస్వామి తదితరులు నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







