యు.ఏ.ఈ లో కార్మికుడి నిజాయితీకి దక్కిన గౌరవం
- September 12, 2017
యు.ఏ.ఈ: ఆసియాకి చెందిన ఓ కార్మికుడు, తనకు దొరికిన ఓ వ్యాలెట్‌ని నిజాయితీగా పోలీసులకు అప్పగించిన ఘటన సంచలనం కలిగించింది. ఆ వ్యాలెట్‌లో 100,000 దిర్హామ్‌లు ఉండటమే దానికి కారణం. ఎయిర్‌పోర్ట్‌లోని ట్రావెల్ ఫార్మాలిటీస్ డెస్క్ వద్ద కార్మికుడికి ఆ వ్యాలెట్ లభించింది. ఎంతో నిజాయితీగా తనకు దక్కిన వ్యాలెట్‌ని పోలీసులకు అందజేసిన ఆ కార్మికుడ్ని అధికారులు సత్కరించారు. షార్జా ఎయిర్పోర్ట్ పోలీస్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మట్టర్ అల్ ఎబ్తి, ఎయిర్పోర్ట్ పోలీస్ ఆపరేషన్స్ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ వాలిద్ అల్ జరౌమి, ఇతర ఉన్నతాధికారులు ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికుడి నిజాయితీని లెఫ్టినెంట్ కల్నల్ అల్ కెత్బి కొనియాడారు. నిజాయితీ గల కార్మికులు సమాజానికి ఎంతో ఉపయోగకరమని చెప్పారు. నిజాయితీని చాటుకునే కార్మికుల్ని సత్కరించడంలో వారిని గౌరవించడంలో షార్జా పోలీస్ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







