ఒమాన్ భర్త ను సజీవ దహనం చేసిన ఆఫ్రికన్ మహిళ అరెస్టు

- September 13, 2017 , by Maagulf
ఒమాన్ భర్త ను సజీవ దహనం చేసిన ఆఫ్రికన్ మహిళ అరెస్టు

మస్కట్ : ఆ పతిదేవులవారు.. ఏం ఒళ్ళు మండించాడోమో ?  గదిలో పెట్టి తాళం వేసి భర్తతో సహా ఏకంగా ఇంటికే నిప్పు పెట్టిందా రాక్షస సతి. మంటలలో మిడత మాదిరిగా కాలిపోయిన వైనం స్థానిక ఖబౌరాలో జరిగింది. కట్టుకొన్న భర్తని సజీవ దహనం చేసిన ఆరోపణలపై ఒక ఆఫ్రికన్ మహిళ అరెస్టు అయ్యింది. ఈ కేసును ఖబౌరా పోలీస్ స్టేషన్ వద్ద విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ విభాగం ద్వారా నార్త్ బాటినాహ్ పోలీస్ కమాండ్ విచారణ మరియు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ల శాఖ సహకరించింది. రాయల్ ఒమాన్ పోలీస్ ఉన్నతాధికారి ఒకరు  " మా గల్ఫ్ డాట్ కామ్ " మాట్లాడుతూ, "ఈ జంట మధ్య వివాదం ఉంది. ఇది నేరానికి దారితీసింది. ఆ గది తన భర్తను గదిలో మూసివేసి ఇంటిని నిప్పంటించారు. ఆ తర్వాత నిందితురాలు అక్కడి నుంచి పారిపోయింది. తర్వాత పోలీసులకు పట్టుబడింది. నేరస్థురాలైన ఆ ఆఫ్రికన్ మహిళను  తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు పంపబడింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com