తెలంగాణ గ‌ల్ఫ్ జెఎసి ఆవిర్భావం

- September 15, 2017 , by Maagulf
తెలంగాణ గ‌ల్ఫ్ జెఎసి ఆవిర్భావం

అంత‌ర్జాతీయ ప్ర‌జాస్వామ్య దినోత్స‌వం సందర్బంగా 15 సెప్టెంబర్ న తెలంగాణ గ‌ల్ఫ్ జెఎసి (తెలంగాణ గల్ఫ్ ఐక్య కార్యాచరణ సమితి) ఆవిర్భవించింది. రాజ‌రాజేశ్వ‌ర స్వామి కొలువైన ప‌విత్ర ప‌ట్ట‌ణం వేముల‌వాడ లో శుక్రవారం తెలంగాణ గ‌ల్ఫ్ జెఎసి ఆవిర్భావ ప్రకటనను ఆ సంస్థ కన్వీనర్ మంద భీంరెడ్డి విలేఖరుల సమావేశంలో ప్రకటించారు. తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నంగి దేవేందర్ రెడ్డి, సుఖీభ సంస్థ ప్రతినిధి బొక్కెనపెల్లి నాగరాజు లు ఈ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. 

గ‌ల్ఫ్ దేశాల‌లోని తెలంగాణ ప్ర‌వాసి సంఘాలు, నిపుణులైన ప్రముఖ వ్య‌క్తులు, విష‌యాత్మ‌క స‌మూహాలు (స‌బ్‌జెక్ట్ ఓరియంటెడ్ గ్రూప్స్‌) మ‌రియు స్వరాష్ట్రం తెలంగాణాలో వ‌ల‌స కార్మికుల హ‌క్కుల కోసం ప‌ని చేస్తున్న స్వ‌చ్చంద సంస్థ‌లు, కార్మిక సంఘాలు, విష‌య ప‌రిజ్ఞానం క‌లిగిన నిపుణులు, గ‌ల్ఫ్ నుంచి వ‌లస‌ వ‌చ్చిన వారు, గ‌ల్ఫ్ కార్మిక కుటుంబాలంద‌రిని క‌లిపి ఒక మ‌హావేదిక "తెలంగాణ గ‌ల్ఫ్ జెఎసి (ఐక్య కార్య‌చ‌ర‌ణ స‌మితి ) ఏర్పాటు చేశామని కన్వీనర్ మంద భీంరెడ్డి తెలిపారు. 

గ‌ల్ఫ్ కార్మికుల హ‌క్కుల ర‌క్ష‌ణ, సంక్షేమం ప్ర‌ధాన ఎజెండాగా ఈ సంస్థ ప‌ని చేస్తుందని,.కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాత్ర‌ను బాధ్య‌త‌ను గుర్తు చేస్తుంది. సుర‌క్షిత ,చ‌ట్ట‌బ‌ద్ద వ‌ల‌స‌లు, పెన్ష‌న్‌, ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియా, న్యాయ స‌హాయం, వాప‌స్ వ‌చ్చిన వారి పున‌రావాసం కోసం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. 

త్వరలో జిల్లాలవారీగా, దేశాలవారీగా తెలంగాణ గ‌ల్ఫ్ జెఎసి కమిటీలను ఏర్పాటుచేస్తామని, వివరాలకు +91 93944 22622 నరేంద్ర పన్నీరు, మస్కట్, ఓమాన్ +968 9783 7893, గుగ్గిళ్ల రవి గౌడ్, ఖతార్ +974 7794 3977 లకు సంప్రదించవచ్చని మంద భీంరెడ్డి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com