తిండి లేకుండా కేవలం మంచినీరు, టీ తోనే బతుకుతున్న 75 ఏళ్ల బామ్మ
- September 16, 2017
60 ఏళ్లనుంచి ఈ బామ్మ ఒట్టి మంచినీరు, టీ తాగి బతికేస్తుంది. అప్పుడప్పుడు ఓ అరటి పండు మాత్రం తింటుందట. మధ్య ప్రదేశ్కు చెందిన సరస్వతీ బాయికి 15 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. ఆ వెంటనే గర్భం దాల్చిన ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చిందట. దాంతో డాక్టర్స్ ఆమెకు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం మాత్రమే తీసుకోమన్నారట. ఆరోజు నుంచి మొదలు ఇప్పటి వరకు నీళ్లు, టీ మాత్రమే తన ఆహారంగా తీసుకుంటుందట. ఇప్పుడు 75 ఏళ్ల వయస్సులో ఉన్న ఈ బామ్మ పొలం పనులు చకచకా చేసేస్తూ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. రోజుకి 7గంటలు పొలంలోనే గడిపేస్తుంది. అయిదుగురు పిల్లలకి తల్లయినా ఏమీ తీసుకోకుండానే 75 ఏళ్లు గడిపింది. అన్నం తినమని ఎన్ని సార్లు చెప్పినప్పటికీ తన మనసు మార్చుకోలేదని ఆమె భర్త ద్వారకా ప్రసాద్ పాటికర్ అంటున్నారు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా బామ్మగారు ఏమి తినరట. కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకుని ఆరోగ్యంగా ఉంటున్న ఈ బామ్మని అందరూ పొగిడేస్తున్నారు.
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







