సీఎం చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా బతుకమ్మ పాటల సీడీ ఆవిష్కరణ

- September 17, 2017 , by Maagulf

ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడీని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. సామాన్య ప్రజలలో ప్రాచుర్యం పొందిన అందమైన బతుకమ్మ పాటలతో ఇప్పటివరకు 8 సీడీలను జాగృతి తయారుచేసింది. ప్రతి ఏడాదిలాగే తెలంగాణ జాగృతి ఇప్పుడు కూడా 40 పాటలతో సీడీని రూపొందించింది. ఇందులో 12 మంది ప్రముఖ జానపద గాయకులు పాడిన బతుకమ్మ పాటలు, ఇతర సంప్రదాయ గేయాలున్నాయి. సంప్రదాయ బతుకమ్మ పాటలు వెలకట్టలేని గొప్ప సాహిత్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
వాటిని సేకరించి సీడీల రూపంలో భద్రపరుచడం మంచి ప్రయత్నమని కొనియాడారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ , ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీన్ ఆచారి, ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్ సాగర్, డాక్టర్ అయాచితం శ్రీధర్, దాస్యం విజయ్‌భాస్కర్, అధికార ప్రతినిధి కుమారస్వామి, కోశాధికారి కొండపల్లి సంతోష్‌కుమార్, మహిళా విభాగం కన్వీనర్ డాక్టర్ ప్రభావతి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కొదారి శ్రీను, వివిధ విభాగాల కన్వీనర్లు కొరబోయిన విజయ్, పసుల చరణ్, డాక్టర్ ప్రీతిరెడ్డి, దాసరి శ్రీనివాస్, అంజనా రెడ్డి, తిరుపతి వర్మ, డాక్టర్ కాంచనపల్లి తదితరులు పాల్గొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com