తేజు, వినాయక్ మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్ ఫిక్స్
- September 18, 2017
వెండి తెరపై అడుగు పెట్టిన వెంటనే వరుసగా మూడు హిట్స్ ఇచ్చిన మెగా హీరో సాయిధరమ్ తేజ్, ఇఫ్పుడు వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు. త్వరలోనే జవాన్ మూవీతో వస్తున్న తేజూ.. వినాయక్ తో చేయబోయే సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోవడానికి తేదీని ఫిక్స్ చేసుకొన్నది..
మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో వరుసగా హిట్స్ కొట్టాడు. కానీ ఆ తర్వాత నటించిన తిక్క, విన్నర్ చిత్రాలు నిరాశపరిచాయి. దీంతో ఇప్పుడు హిట్ కొట్టాలనే కసితో జవాన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాయిధరమ్ తేజ్ కొత్త సినిమా జవాన్. బి.వి.ఎస్.రవి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మెహ్రీన్ జంటగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే కొన్ని సీన్లు రీ షూట్ చేస్తున్న టీమ్, మూవీని అక్టోబర్ ఎండింగ్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.
జవాన్ రిలీజ్ అయ్యే సమయానికి వినాయక్ సినిమా ని పట్టాలెక్కించడానికి తేజు రెడీ అవుతున్నాడు.. మెగా హీరో సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు గత నెలలో జరిగాయి. అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈ నల 27నుంచి ప్లాన్ చేశారు. ఈ చిత్రానికి దుర్గ, ఇంటెలిజెంట్ అనే టైటిల్ ప్రచారంలో ఉన్నాయి. ఖైదీ నంబర్ 150 తర్వాత వినాయక్ చేసే సినిమా ఇదే. మరి తేజూని వినాయక్ ఎలా ప్రజెంట్ చేస్తాడో చూడాలి. ఇప్పటికే వినాయక్ మెగాహీరోలైన చిరంజీవి, రామ్ చరణ్, బన్నిలతో సినిమాలు చేసి హిట్ కొట్టాడు.. మరి తేజు తో కూడా హిట్ కొట్టి రికార్డ్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి మరి.!
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









