సినీ ప్రముఖులకు మోదీ లేఖలు
- September 18, 2017
న్యూదిల్లీ: కేంద్రం ప్రభుత్వం తలపెట్టిన 'స్వచ్ఛతా హీ సేవా' (స్వచ్ఛతే సేవ) కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ప్రధాని మోదీ దేశంలోని పలువురు ప్రముఖులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు వారికి ఆయన లేఖలు రాశారు. ఇందులో తెలుగు సినీ ప్రముఖులూ ఉన్నారు. 'స్వచ్ఛతే సేవ'లో భాగస్వాములు కావాలని, దేశంలో స్వచ్ఛత పెంపొందించేందుకు కృషి చేయాలని లేఖలో మోదీ పేర్కొన్నారు.
తెలుగు సినీ పరిశమ్రకు చెందిన దర్శకుడు రాజమౌళి, సినీ నటులు మోహన్‌బాబు, ప్రభాస్, మహేశ్‌బాబు తదితరులకు నరేంద్రమోదీ లేఖలు రాశారు. అంతకుముందు మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు కూడా మోదీ లేఖ రాశారు. స్వచ్ఛభారత్‌కు సహకరించాలని లేఖలో కోరారు.
'మహాత్మాగాంధీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది సమాజం పట్ల మనకున్న వైఖరిని ప్రతిబింబిస్తుంది. ఈ కార్యక్రమంలో మీరు భాగస్వాములు అవుతూ, మరింత మంది పాల్గొనేలా ప్రోత్సహించాలి. మీ అందరినీ నేను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. 'స్వచ్ఛతే సేవ' ఉద్యమం కోసం మీ సమయాన్ని కొంత కేటాయించింది. అదే మనం బాపుకి ఇచ్చే నిజమైన ఘన నివాళి' అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు.
నవ భారత నిర్మాణంలో క్లీన్ ఇండియా ముఖ్య భూమిక పోషిస్తుందని ఆయన అన్నారు. స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ప్రేరణగా నిలవాలని మోదీ కోరారు. చివరగా 'జైహింద్' అని రాసి మోదీ తన లేఖను ముగించారు. 'స్వచ్ఛతే సేవ' కార్యక్రమాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గత వారం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేంద్రమంత్రులు, భాజపా పార్లమెంటేరియన్లు తప్పనిసరిగా ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మోదీ నుంచి వారందరికీ సూచనలు అందాయి.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







