సంక్షేమానికి సరికొత్త అర్థాలు..
- September 18, 2017
తెలంగాణ ప్రభుత్వం రోజుకో పథకం తీసుకొస్తోంది. సంక్షేమంలో దూకుడు మీదున్న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఎప్పటికప్పుడు కొత్త వర్గాలను గుర్తిస్తూ వారికి సరికొత్త పథకాలు ప్రవేశ పెడుతున్నారు. బీసీలుగా ఉన్న కుల వృత్తులకు ఇప్పటికే పలు పథకాలు అమలు చేస్తున్నారు. యాదవ, కురుమలకు గొర్రెలు పంపిణీ చేస్తున్నారు. నాయిబ్రహ్మాణలకు సెలూన్ల పేరుతో లక్ష ప్రకటించారు. మత్య్సకారులకు చేపల పంపిణీ మొదలుపెట్టారు. చాకలి, కుమ్మరి, కమ్మరి వర్గాలకు ఆర్ధిక సాయం ఇస్తామన్నారు. రైతులకు పెట్టుబడి పథకం ప్రకటించారు. మహిళలకు బతుకమ్మ పండగ చీరెలు పంపిణీ చేస్తున్నారు. క్షీర విప్లవం పేరుతో పాడి పరిశ్రమపై ఆధారపడ్డవారికి బర్రెలు ఇస్తామంటున్నారు. 50 శాతం సబ్సిడీ కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలు అయితే 75శాతం ఇస్తామంటున్నారు. గ్రామాల్లో ఉండి వృత్తులపై ఆధారపడ్డ ఏ వర్గం కూడా అసంతృప్తిగా ఉండకూడదని.. ఆర్ధికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అంటున్నారు. గ్రామస్వరాజ్యం సాధించి బంగారు తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తామంటున్నారు కేసీఆర్. ఒక్కో వర్గంతో ప్రతిగభవన్ లో సమావేశం అవుతూ పథకాలను ప్రకటిస్తున్నారు. సంక్షేమంలో దూకుడుగా వెళుతున్న కేసీఆర్ మతాల వారీగా కూడా భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే ఎస్టీలకు, మైనార్టీలకు రిజర్వేషన్లపై హామీ ఇచ్చారు. బీసీలకు కూడా జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచడానికి కసరత్తు చేస్తున్నామని... కమిషన్ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. అయితే పథకాలు కాదు... రాజ్యాధికారం కావాలంటూ డిమాండ్ చేస్తున్నాయి బీసీ సంఘాలు. మెజార్టీ ప్రజలున్న వర్గాల చేతిలో అధికారం ఉండాలని వారు కోరుకుంటున్నారు. అధికారం మీ గడప దాటకుండా సంక్షేమం పేరుతో కులాలు, మతాల పేరుతో పథకాలు పెట్టి మభ్యపెడుతున్నారని సంఘాలు విమర్శిస్తున్నాయి.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







