ఇంట్లో గంజాయి పెంచుతున్న కువైట్ వ్యక్తి అరెస్టు

- September 20, 2017 , by Maagulf
ఇంట్లో గంజాయి పెంచుతున్న కువైట్ వ్యక్తి అరెస్టు

కువైట్ : మాదకద్రవ్యాలను అక్కడా ఇక్కడా రహస్యంగా దాచి వ్యక్తులతో  తరలించడం ..ఆఖరి నిమిషంలో మాదకద్రవ్య నిరోధక శాఖ అక్రమ రవాణాదారులను వల పన్నిపట్టుకోవడం...ఈ తరహా తలనొప్పులు తప్పించుకోవాలని ఓ కువైట్ కర్షకుడు వినూత్న ప్రయోగం చేశాడు. గంజాయిని ఇంటి ఆవరణలోనే  పెరటి తోటల పెంపకం మాదిరిగా ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించి  శాస్త్రీయ సాంకేతిక పద్ధతుల మేళవింపుతో   ఎంచక్కా గంజాయి విత్తనాలు చల్లి ...వేళకు నీరు .. కృత్రిమంగా ఎయిర్ కూలర్లతో సరిపడే గాలి ..ఏపుగా పెరగడానికి ఎరువులు... పురుగు మందులు చల్లుతూ ... ఆరుగాలం శ్రమించిన  కష్టం మరి కొద్దిరోజులలో చేతికి వస్తుందనుకొనే సమయానికి ఆ గంజాయి రైతుని పోలీసులు మంగళవారం  అదుపులోనికి తీసుకొన్నారు. ఆ నిందితుని వద్ద పెద్ద మొత్తంలో గంజాయి మొక్కలను కనుగొన్నారు. అనుమానితుడు, కువైట్ వాసి కాగా మరింత విచారణ చేయడానికి  రెండు వారాల పాటు పర్యవేక్షణలో ఉంచారు. ఒక పూర్తిస్థాయి ప్లాస్టిక్ కంటైనర్లను కలిగి ఉన్న 'పూర్తి సాంకేతిక పద్ధతులతో గంజాయి మొక్కలు నాటబడిన  ప్రాంతం' గా పోలీసులు వర్ణించారు, దాదాపు 1,000 గంజాయి మొక్కలు విక్రయించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ నిందితుడిని పెద్ద సంఖ్యలో గంజాయి విత్తనాలు కనుగొన్నారు. ఆ గంజాయి రైతుపై తదుపరి చర్య కోసం డ్రగ్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్ కు  తరలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com