బహ్రెయిన్‌లో పెరిగిన ఈ-ట్రాన్స్ఫర్స్
- September 21, 2017
మనామా: బహ్రెయిన్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ (ఇఎఫ్టిఎస్), 2017 తొలి సగంలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసినట్లు తెలిపింది. ఫావ్రి ప్లస్, ఫావ్రి మరియు ఫాతీర్ సిస్టమ్స్ ద్వారా ఈ-ట్రాన్స్ఫర్స్ బాగా పెరిగినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ వెల్లడించినట్లు పేర్కొంది. 2015 నవంబర్ 5న ఇఎఫ్టిఎస్ ప్రారంభమయ్యింది. లోక్ బ్యాంకుల నుంచి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ ఈ ఈఎఫ్టిఎస్ ఉద్దేశ్యం. ఫావ్రి ప్లస్ లావాదేవీలు 153,000 గా నమోదయ్యాయి. వీటి విలువ 37.9 మిలియన్ బహ్రెయినీ దినార్స్. ఈ మొత్తం 211 శాతం అధికంగా పేర్కొంటున్నారు అధికారులు. ఫావ్రి లావాదేవీలు 2.4 మిలియన్ కాగా వీటి విలువ 4.6 బిలియన్ బహ్రెయినీ దినార్స్. ఈ వృద్ధిపై బ్యాంకింగ్ ఆపరేషన్స్ - సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షేక్ సల్మాన్ బిన్ ఇసా అల్ ఖలీఫా మాట్లాడుతూ, సరికొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో సెంట్రల్ బ్యాంక్ ముందంజలో వుంటోందని ప్రశంసించారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









