వంటగదిలో గ్యాస్ స్టవ్ పేలుడు.....ఒక్క ఉదుటున రోడ్డుపైకి వచ్చి పడిన వ్యక్తి
- September 23, 2017
షార్జా : వంటింట్లో నిద్రాణమైన ఒక శక్తివంతమైన బాంబు..గ్యాస్ సిలెండర్ అని బహుశా మన పెద్దలు ఊరికే అనలేదేమో ? ఒక్కోసారి దాని తీవ్రత సామాన్యంగా ఉండటంలేదు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో స్థానిక షార్జా ఇండస్ట్రి ఏరియాలోని ఒక భవనంలో ఒక శక్తివంతమైన గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో ఆసియా దేశానికి చెందిన ఒక వ్యక్తి ఆ పేలుడు ధాటికి అపార్ట్మెంట్ మొదటి అంతస్థు వంట గది నుండి ఒక్క ఉదుటున రోడ్డుపైకి వచ్చి పడి గాయాలపాలయనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు మరియు పౌర రక్షణ బృందాలు ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో ప్రమాద ప్రాంతానికి చేరుకున్నాయి. తక్షణమే గాయపడిన వ్యక్తిని కువైట్ హాస్పిటల్ కు తరలించినట్లు ఒక పోలీసు అధికారి చెప్పారు. ఒక అనుమానిత వాయువు లీక్ వలన పేలుడు యొక్క బలమైన ప్రభావం, భవనం యొక్క మొదటి అంతస్తులో ఉన్న తన అపార్ట్మెంట్ నుండి మనిషి విసిరివేయబడినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో భవనం మరియు కింద నిలిపి ఉన్న 5 కార్లకు నష్టం కల్గింది. షార్జా పోలీస్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లోని ఫైర్ ఎక్స్ పర్ట్ ఆదిల్ అల్ మజ్మి ఈ భవనం యొక్క అద్దాల కిటికీలు పేలుడులో దెబ్బతిం చిందని చెప్పారు."పోలీసు మరియు పౌర రక్షణ బృందాలు ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో ఈ ప్రాంతానికి చేరుకున్నాయి మరియు గాయపడిన వ్యక్తిని కువైట్ హాస్పిటల్కు తరలించారు, ఈ రెండు విభాగాల రక్షణా దళాలు తమ భద్రతకు అనుగుణంగా మంటలకు ప్రభావితమైన ఆ అపార్ట్మెంట్ భవనం నుండి 77 కుటుంబాల వారిని వెంటనే ఖాళీ చేయించినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?







