యాంకర్ శ్రీముఖి నటిస్తున్న `గుడ్ బ్యాడ్ అగ్లీ`టీజర్ రిలీజ్డ్
- September 23, 2017
గుడ్ అంటే మంచి, బ్యాడ్ అంటే చెడు, అగ్లీ అంటే తింగరితనం అనే పదాలు మనకు తెలిసిందే. వీటిని సందర్భానుసారం వాడుతుంటారు. ఇప్పుడు వీటినే టైటిల్‌గా పెట్టి రచయిత హర్షవర్ధన్ ఓ సినిమాను తెరకెక్కించారు. యంకర్ శ్రీముఖి, మురళీ ప్రధాన పాత్రలుగా `గుడ్ బ్యాడ్ అగ్లీ` అనే టైటిల్ తో రూపొందించారు. ఈ సినిమాకు హర్షవర్ధన్ సంగీత సారథ్యం వహించడం మరో విశేషం. 1988-89 కాలంలో ఓ మారుమూల గ్రామంలో జరిగిన ప్రేమకథే ఈ చిత్రం. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించారు హర్షవర్థన్. అంజిరెడ్డి ప్రొడక్షన్, ఎస్.కె.విశ్వేష్‌బాబు సమర్పణలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అంజి రెడ్డి నిర్మాత. ఈ సినిమా టీజర్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







