స్త్రీల బుర్రలో సగం మెదడు ఉంటుందని హేళన చేసిన ఓ ఇమామ్
- September 23, 2017
మానామా: నాలుకా...వీపునకు దెబ్బలు తీసుకురాకు అని మన తెలుగులో చక్కని సామెత ఉంది..అది తెలియని ఓ మతబోథకుడు నోరు ఇలా జారేడు.. " ఆడవారు సరిగా ఆలోచించలేరు.... స్త్రీల బుర్రలో సగం మెదడు ఉంటుందని " పైత్యం తలకెక్కిన ఓ ఇమామ్ మహిళలపై నోరు పారేసుకుని ఫలితంగా తన జీవనాధారాన్ని చేచేతులారా పోగొట్టుకున్నాడు. వివరాలలోకి వెళితే ఓ మతబోథకుడు ఇటీవల స్త్రీలను కించపరుస్తూ ఎగతాళిగా మాట్లాడాడు. ‘మహిళలకు కేవలం సగం మెదడు మాత్రమే ఉంటుంది. . సగం మెదడు ఉండే వీరిని షాపింగ్‌కు తీసుకుపోతే మరో 25 శాతం కూడా తగ్గిపోతుంది’ అని సాద్ అల్ హజారీ అనే ఓ ఇమామ్ వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. మహిళలను తీవ్రంగా అవమానించేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని మహిళలు, నెటీజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన సౌదీ యువరాజు ఫైసల్ బిన్ ఖలీద్ బిన్ అబ్ధుల్ అజీజ్ మతప్రబోధకుడని తొలగించారు. ఇకపై ఆ ఇమామ్ ఎలాంటి మతప్రబోధనలు చేయకూడదంటూ ఆదేశించారు.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







