చామకూర పకోడీ
- September 24, 2017కావలసిన పదార్థాలు: చామకూర- 10 వెడల్పాటి ఆకులు, సెనగపిండి- 1 కప్పు, ఉప్పు- తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్- 1 చెంచా, కారం- 1 చెంచా, పసుపు- చిటికెడు, గరం మసాలా- చిటికెడు, సన్నగా తరిగిన కొత్తిమీర- కొంచెం, నూనె- సరిపడినంత
తయారీ విధానం: చామకూర ఆకులను కడిగి తుడిచి పెట్టుకోవాలి. సెనగపిండిలో మిగతా వస్తువులు, కొద్దిగా నీరు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. చామకూర ఆకుపై ఈ ముద్దను పలుచగా రాసి చాప చుట్టలా మడిచి ఉంచాలి. అదే విధంగా అన్ని ఆకులతో చేసుకోవాలి. ఈ మడతలను ఆవిరి మీద పదిహేను నిమిషాలు ఉడికించాలి. అవి చల్లారిన తర్వాత అంగుళం వెడల్పుతో ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో ఎర్రగా కరకరలాడేలా వేయించుకోవాలి. వీటిని ఉల్లిచక్రాలతో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ