ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో బతుకమ్మ సంబురాలు

- September 26, 2017 , by Maagulf
ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో బతుకమ్మ సంబురాలు

ఐర్లాండ్‌లోని డబ్లిన్ నగరంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. తెలంగాణ ఎన్నారైలు(తెలంగానైట్స్ ఆఫ్ ఐర్లాండ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు ప్రవాస తెలంగాణవాసులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. గత ఐదేళ్ల నుంచి ఐర్లాండ్‌లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. రంగు రంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, యువతులు బొడ్డెమ్మలను ఆడారు. దాండియాతో అందరినీ అలరించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఐర్లాండ్‌లో వెల్లివిరిశాయి. అందంగా పేర్చిన బతుకమ్మలకు బహుమతులను అందజేశారు నిర్వాహకులు. బతుకమ్మ వేడుకలకు వచ్చిన వారందరికీ రుచికరమైన వంటకాలను వడ్డించారు. బతుకమ్మ వేడుకలకు ఇండియన్ ఎంబసీ తరపున సెక్రటరీ అనిత శుక్ల, ఐర్లాండ్ ఎంపీ రూత్ కోపింగర్ హాజరయ్యారు. తెలంగాణ ఎన్నారైలు..జగన్ మేకల, ప్రబోధ్ మేకల, కమలాకర్ కోలన్, సాగర్, శ్రీనివాస్ కార్పె, రాజేష్ ఆది, రవీందర్ చప్పిడి, వెంకట్ అక్కపల్లె, వెంకట్ గాజుల, బలరాం కొక్కుల, వెంకట్ జూలూరి, శ్రీనివాస్ పటేల్, షరీష్ బెల్లంకొండ, శ్రీకాంత్ సంగిరెడ్డి, శశిధర్ మర్రి, దయాకర్ కొమురెల్లి, అల్లంపల్లి శ్రీను, అల్లే శ్రీను, సుమంత్ చావా, వెచ్చ శ్రీను, సిల్వెని శ్రీను, ప్రవీణ్లాల్, ప్రదీప్ యల్క, వెంకట్ యానాల, త్రీషిర్ పెంజర్ల, నగేష్ పొల్లూరు, నవీన్ గడ్డం, వెంకట్ తిరుకోవలురు, సునీల్ పాక, శ్రీధర్ యమసాని, కొసనం శ్రీను, శ్యామ్, వినోద్ పేరూరి, కల్లూరి గోపి, రామ గౌడ్ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com