మద్యం మత్తులో క్లీనర్‌పై లైంగిక దాడి
- September 26, 2017
భారతీయుడొకరు, మద్యం మత్తులో క్లీనర్‌పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన నేపథ్యంలో సదరు వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరు పరిచారు. వివరాల్లోకి వెళితే, ఇంటిని క్లీన్ చేసేందుకోసం మూడు గంటల పని నిమిత్తం ఓ మెయిడ్‌ని పిలిపించుకున్నాడు నిందితుడు. జులై 24న ఉదయం 8.30 నిమిషాల సమయంలో ఇంటిని క్లీన్ చేసే పని నిమిత్తం, నిందితుడికి ఇంటికి వెళ్ళినట్లు బాధితురాలు పేర్కొన్నారు. పనిచేస్తున్న సమయంలో, పని ఆపేసి తనతో ఉండాల్సిందిగా నిందితుడు ఒత్తిడి తీసుకొచ్చాడనీ, ఈ క్రమంలో సెక్సువల్‌గా తనను వేధింపులకు గురిచేశాడని బాధితురాలు విచారణలో పోలీసులకు వివరించారు. నిందితుడి నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు పోలీసుల్ని ఆశ్రయించారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించామని, వివరాలు సేకరించాక నిందితుడ్ని కోర్టులో ప్రవేశపెట్టామని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు అందుకున్న రోజునే జబెల్ అలి పోలీసులు నిందితుడ్ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







