పాకిస్తాన్ పై ఇండియన్ ఆర్మీ మరో సర్జికల్ స్ట్రైక్
- September 27, 2017
బుధవారం తెల్లవారుఝామున ఇండియన్ ఆర్మీ మరో సర్జికల్ స్ట్రైక్ చేసింది. అయితే ఈసారి ఇండో, మయన్మార్ బోర్డర్‌లో ఈ దాడులు జరిగాయి. నాగా తీవ్రవాదుల శిబిరాలపై ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఉదయం 4.45 గంటల ప్రాంతంలో ఇండియన్ పారా కమాండోలు ఈ దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాగా తీవ్రవాదుల శిబిరానికి భారీ నష్టం వాటిల్లినట్లు ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ వైపు ఎలాంటి నష్టం జరగలేదని కూడా స్పష్టంచేసింది. గతేడాది ఇదే సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆర్మీ సర్జికల్ ైస్ట్రెక్ నిర్వహించిన విషయం తెలిసిందే. 2001లో భారత ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకాలు చేసింది నాగా ఉగ్రవాద సంస్థ. అయితే 2015, మార్చి 27న ఆ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. నాగాలాండ్, మణిపూర్‌లలోని భారత జవాన్లపై దాడులు చేశారు. జూన్ 4, 2015లో మణిపూర్‌లోని డోగ్రా రెజిమెంట్‌లో ఆర్మీ కాన్వాయ్‌పై దాడి చేయగా 18 మంది సైనికులు మృత్యువాత పడ్డారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!







