అక్టోబర్ 27న వస్తున్న రామ్ 'ఉన్నది ఒక్కటే జిందగీ'
- September 28, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా ఉన్నది ఒక్కటే జిందగీ. నేనుశైలజతో రామ్ కి చాలా గ్యాప్ తర్వాత హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. దీంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ ఉంది. చిత్ర యూనిట్ ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసింది.
నేను శైలజ తర్వాత రామ్ నటించిన చిత్రం హైపర్. ఈ మూవీకి హిట్ టాక్ వచ్చినా, బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా అంతగా సక్సెస్ కాలేకపోయింది. దీంతో మళ్ళీ రామ్, నేను శైలజ డైరెక్టర్ కిషోర్ తిరుమలకే చాన్స్ ఇచ్చాడు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ఉన్నది ఒక్కటే జిందగీ. ఈ మూవీని అక్టోబర్ 27న రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ డేట్ ఫిక్స్ చేసింది.
ఉన్నది ఒక్కటే జిందగీ మూవీలో రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఈ మూవీలో రామ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి నటిస్తున్నారు. దేవీశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. లవ్, ఫ్రెండ్ షిప్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కే ఈ మూవీ షూటింగ్ ఇటలీ మిలాన్ వంటి ఫేమస్ లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. ఈ మూవీతో రామ్, కిషోర్ తిరుమల మరో హిట్ ఇస్తారో లేదో చూడాలి.
తాజా వార్తలు
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు







