పీహెచ్డీ సాధించిన బఫే వర్కర్
- September 28, 2017
అల్ అహ్సా: యెమనీ జాతీయుడైన సలెహ్ అనే యువకుడు, ప్రముఖ బఫెట్ రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. తన తండ్రితో కలిసి చిన్నప్పటినుంచీ ఈ పని చేస్తున్నాడు. అయితే చదువుకోవాలన్న తన ఆలోచనల్ని మాత్రం విడిచిపెట్టలేదు. యెమెన్ నుంచి హై సెకెండరీ స్కూల్ సర్టిఫికెట్‌ని పొందిన సలేహ్, ఖురానిక్ సైన్సెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని కూడా పొందాడు. ఆ తర్వాతా చదువు కొనసాగించిన సలెహ్, మాస్టర్ డిగ్రీని పొంది అల్ అహ్సాకి వచ్చి తిరిగి తన తండ్రి, సోదరుడితో కలిసి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడు. పీహెచ్డీ చేయాలన్న కోరికతో సుడాన్ వెళ్ళి, అక్కడ ఒండోర్మాన్ ఇస్లామిక్ యూనివర్సిటీలో పీహెచ్‌డి పూర్తి చేసి, తిరిగి వచ్చినట్లు సలెహ్ వెల్లడించాడు. పీహెచ్డీ సాధించిన సలెహ్‌ని అతను పనిచేసే రెస్టారెంట్‌కి వచ్చే వినియోగదారులు 'డాక్టర్ సలెహ్' అని పిలుస్తోంటే ఆయనకి ఎంతో గర్వకారణంగా ఉంటోందట.
తాజా వార్తలు
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం







