అనుష్కతో కలసి మహానుభావుడుని చూసిన మెహరిన్

- September 29, 2017 , by Maagulf
అనుష్కతో కలసి మహానుభావుడుని చూసిన మెహరిన్

శర్వానంద్, మెహరిన్ జంటగా నటించిన మూవీ మహానుభావుడు.. మారుతీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ రోజే విడుదలైంది.. అయితే ఈ చిత్ర యూనిట్ సినీ సెలబ్రిటీస్ కోసం ప్రత్యేక షోను వేసింది.. ఈ షోను హీరోయిన్ మొహరిన్ తన అభిమాన హీరోయిన్ దేవసేన అనుష్క తో కలసి చూసింది.. ఈ సందర్భంగా సినిమా థియేటర్లో అనుష్క తో కలిసి దిగిన ఫొటోను మెహరీన్‌ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. నా అభిమాన నటి స్వీటీ గారితో మహానుభావుడు్ణ ఫస్ట్‌ షో చూశా. చాలా ప్రత్యేకమైన మూమెంట్‌ అని కామెంట్ చేసింది. కాగా ఈ రోజే విడుదలైన ఈ మూవీ హిట్ టాక్ ను స్వంతం చేసుకోవడం పట్ల ఈ మూవీ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com