శివాజీగణేషన్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఒకే వేదికపై రజనీ,కమల్
- October 01, 2017
రాజకీయ అరంగేట్రంపై విస్పష్ట సంకేతాలు పంపిన అగ్ర నటులు రజనీకాంత్, కమల్ హాసన్ ఆదివారం ఒకే వేదికపై మెరిశారు. శివాజీగణేషన్ స్మారక కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజకీయాలపై రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో రాణించాలంటే డబ్బు, ఇమేజ్ ఒక్కటే సరిపోదని ఇంకా ఏదో అవసరమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజలతో మమేకమైతేనే వారి ఆదరణ చూరగొంటామన్నారు.తన కన్నా కమల్ హాసన్ కు రాజకీయాల్లో ఎలా జయించవచ్చో బాగా తెలుసన్నారు.
రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఏం కావాలని ఇటీవల తాను కమల్‌ను అడగ్గా ఆయన తనతో వస్తే చెబుతానని చెప్పారన్నారు. ఈ విషయం రెండు నెలల ముందు అడిగి ఉంటే బాగుండేదేమోనని వ్యాఖ్యానించారు. కాగా, శివాజీ గణేషన్ స్మారక కేంద్రాన్ని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రారంభించారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







