ఆస్ట్రియాలో బురఖా ధరిస్తే రూ.11,000 జరిమానా

- October 02, 2017 , by Maagulf
ఆస్ట్రియాలో బురఖా ధరిస్తే రూ.11,000 జరిమానా

ఆస్ట్రియాలో ముఖాన్ని పూర్తిగా కప్పుకునే వస్త్రాలను ధరించడంపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఇస్లాం సంప్రదాయం ప్రకారం బురఖా ధరించడం కూడా శిక్షార్హమే. ఆసుపత్రుల బయట సర్జికల్ మాస్క్‌లు, బహిరంగంగా పార్టీ మాస్క్‌లు వంటివాటిని ధరించడంపై కూడా నిషేధం ఆదివారం నుంచి అమల్లోకి వచ్చింది. అతి సంప్రదాయ ముస్లిం మహిళలు ధరించే బురఖాపై నిషేధం విధించేందుకే ఈ చట్టాన్ని ఆమోదించినట్లు కొందరు చెప్తున్నారు. ఈ చట్టాన్ని ఉల్లంఘించినవారికి 150 యూరోలు (సుమారు రూ.11,770) జరిమానా విధించవచ్చు. ప్రజలు తమ ముఖాలను చూపించేందుకు నిరాకరిస్తే, వారిపై బల ప్రయోగం చేయడానికి కూడా పోలీసులకు అధికారం ఉంది.
ఫ్రాన్స్, బెల్జియంలలో కూడా ఇటువంటి చట్టాలు అమలవుతున్నాయి. జర్మనీలో కూడా ఇదే తరహాలో చట్టాలను ఆమోదించాలని నేషనలిస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ పార్టీ డిమాండ్ చేస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com