300 ఒమన్‌ రియాల్జ్‌ జీతముంటే వలసదారుడు కుటుంబాన్ని తెచ్చుకోవచ్చు

- October 02, 2017 , by Maagulf
300 ఒమన్‌ రియాల్జ్‌ జీతముంటే వలసదారుడు కుటుంబాన్ని తెచ్చుకోవచ్చు

మస్కట్‌: వలసదారుడు గనుక 300 ఒమన్‌ రియాల్స్‌ని జీతంగా సంపాదించగలిగితే, కొత్త ఎమెండ్‌మెంట్‌ ద్వారా వలసదారుడు తన కుటుంబాన్ని ఒమన్‌కి తెచ్చుకునేందుకు వీలుందని రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించారు. ఇంతవరకు ఈ మినిమమ్‌ సేలరీ 600 ఒమన్‌ రియాల్స్‌గా ఉండేది. షురా కౌన్సిల్‌ మెంబర్‌ సుల్తాన్‌ బిన్‌ మజిద్‌ అబ్రి, వీసా కండిషన్‌కి సంబంధించి కనీస వేతనం 600 ఒమన్‌ రియాల్స్‌ నుంచి 300 ఒమన్‌ రియాల్స్‌కి సవరణ చేసినట్లు ట్విట్టర్‌లో తెలిపారు. తన్‌ఫీద్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త నిర్ణయం ద్వారా లోకల్‌ ఎకానమీ బాగా పెరుగుతుందని, రియల్‌ ఎస్టేట్‌, రిటెయిల్‌, ఇన్స్యూరెన్స్‌ రంగాల్లో కొత్త ఉత్సాహం నింపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com