గ్యాంగ్రిన్ వ్యాధితో యువ కన్నడ హీరో మృతి
- October 03, 2017
చలన చిత్ర పరిశ్రమలో వరస విషాదాలు చోటు చేసుకొంటున్నాయి.. ఇటీవల బాలీవుడ్ సీనియర్ నటుడు టామ్ మరణం నుంచి ఇంకా తేరుకొని చిత్ర పరిశ్రమకు ఓ యువ కన్నడ నటుడు మరణం షాక్ ఇచ్చింది.
బాలనటుడిగా పలు సినిమాల్లో నటించిన రాకేశ్ హీరో గా అడుగు పెట్టి.. రాణిస్తున్నాడు. 'పప్పుసీ కామెడీ' ఫేమ్ గా పేరు తెచ్చుకొన్న రాకేశ్(27) మంగళవారం రోజున మృతి చెందారు. అత్యంత ప్రమాదకరమైన గ్యాంగ్రిన్ వ్యాధితో బాధపడుతున్న రాకేశ్ రెండు నెలల క్రితం శాస్త్ర చికిత్స చేయించుకొన్నారు.. కానీ మళ్ళీ వ్యాధి తిరగబెట్టడంతో తిరిగి రాకేశ్ సియింట్ జాన్స్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. చికిత్స పొందుతూ ప్రాణాలను కోల్పోయాడు. రాకేశ్ నటిస్తున్న తాజా సినిమా 'ధూమపాన' సినిమా షూటింగ్ చివరిదశలో ఉన్నది. కాగా రాకేశ్ తల్లిదండ్రులు ఆశారాణి, నాగేష్ లు కూడా నటులే... రాకేశ్ మృతి పలువురు నటీనటులు సంతాపం తెలియజేశారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు









