2019 అసెంబ్లీ కోసం జనసేన ఎన్నికల ప్లాన్
- October 07, 2017
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ర్టాల్లో మొత్తం స్థానాలకు పోటీ చేస్తున్నట్లు జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి స్పష్టంచేశారు. ప్రస్తుతం జనసేన.. ఎన్డీయేలో భాగస్వామి కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు వుంటుందో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పవన్ నిర్ణయం తీసుకుంటారని అన్నారు.
మొన్నటికిమొన్న తెలుగు రాష్ర్టాల్లో 175 సీట్లకే పోటీ చేస్తామని జనసేన పార్టీ సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన విషయం తెల్సిందే! త్వరలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ 'ప్రజాయాత్ర'కు రెడీ అవుతున్నారని, దీని ముఖ్యఉద్దేశం ప్రజా సమస్యల పరిష్కారమేనని స్పష్టంచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన పర్యటిస్తారని, 2019 ఎన్నికల్లో 60 శాతం సీట్లు జన సైనికులకే టికెట్లు ఇస్తామన్న ఆయన, పార్టీ కోసం పనిచేసే వారందరికీ సముచిత స్థానం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రత్యేకహోదాపై ఏ పార్టీతోనైనా కలిసి పోరాడటానికి జనసేన సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కృష్ణాజిల్లాలో జనసేన ఔత్సాహిక కార్యకర్తల ఎంపిక శని,ఆదివారాల్లో జరుగుతోందని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్‌ఛార్జి హరిప్రసాద్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







