సమంత కు విషెష్ తెలిపిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..

- October 07, 2017 , by Maagulf
సమంత కు విషెష్ తెలిపిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్..

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ సమంత వివాహ శుభాకాంక్షలు అందించారు. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న అక్కినేని నాగ చైతన్య , సమంతలకు కేటీఆర్ తన ట్విట్టర్ ద్వారా వివాహ శుభాకాంక్షలు తెలిపారు. గత రాత్రి గోవాలో హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం నాగ చైతన్య , సమంతలు ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకు రామానాయిడు ఫ్యామిలీ , అక్కినేని ఫ్యామిలీ మరియు సమంత ఫ్యామిలీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు..
వీరి ఎనిమిదేళ్ల ప్రేమబందానికి శుక్రవారం పెళ్లితో మరింత బలపడింది. రెండు మతాలకు చెందిన వీరి వివాహం హిందూ, క్రిష్టియన్ మత సంప్రదాయాల్లో జరగనుంది. దానిలో భాగంగా తొలుత గోవాలోని బీచ్ ఒడ్డున వున్న ఓ హోటల్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం రాత్రి 11గంటల 52 నిమిషాలకు వివాహం జరిగింది. ఈరోజు క్రిష్టియన్ పద్దతిలో వివాహం చేసుకోబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com