'హిందీ మీడియం' లో వెంకటేష్
- October 08, 2017
హైదరాబాద్: కథానాయకుడు వెంకటేశ్ 'గురు' చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చారు. 'సాలా ఖడూస్'కు రీమేక్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆయన బాక్సర్‌గా కనిపించారు. ఇప్పుడు వెంకటేశ్ మరో రీమేక్‌లో నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్‌ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రం 'హిందీ మీడియం'. ఇది కమర్షియల్‌గా మంచి హిట్ అందుకుంది. దీన్ని తెలుగులో రీమేక్ చేయడానికి దర్శకురాలు నందినిరెడ్డి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. వెంకటేశ్‌ను ఇర్ఫాన్ పాత్రకు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వెంకీ ఇది వరకు 'ఈనాడు', 'గోపాల గోపాల', 'గురు', 'మసాలా', 'దృశ్యం' వంటి పలు రీమేక్ చిత్రాల్లో నటించారు.
రూ.12 కోట్లతో తెరకెక్కించిన 'హిందీ మీడియం' దాదాపు రూ.102 కోట్లు వసూలు చేసింది. తమ బిడ్డను ఎలాగైనా ఇంగ్లిష్ మీడియం స్కూల్లో చదివించాలని భావించే తల్లిదండ్రులకు ఎదురైన సంఘటనలు, వారు వాటిని ఎదుర్కొన్న తీరును దర్శకుడు సాకేత్ చౌదరి వినోదంతోపాటు భావోద్వేగాన్ని జోడించి చూపించారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









