మునక్కాయ, మటన్ దాల్చ
- October 09, 2017కావలసిన పదార్థాలు: మసూరి దాల్ (ఎర్రపప్పు) - 100 గ్రా., శనగపప్పు - 50 గ్రా., ఆవాలు - 5 గ్రా., లవంగాలు - 2, దాల్చినచెక్క - అంగుళం ముక్క, వెల్లుల్లి - 10 గ్రా., మటన్ - అరకేజి, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఉల్లిపాయలు - 2, కరివేపాకు - 4 రెబ్బలు, పచ్చిమిర్చి - 10, మునక్కాయలు - 2, పుదీనా - 1 కట్ట, ఆమ్కా చూర్ - 10 గ్రా., కారం - అర టీ స్పూను, పసుపు - పావు టీ స్పూను, నెయ్యి - 50 గ్రా., ఉప్పు - రుచికి తగినంత, మటన్ స్టాక్ - అర లీటరు.
తయారుచేసే విధానం: మసూరి, శనగపప్పులను ఒక గంటసేపు నానబెట్టాలి. నూనెలో అల్లం వెల్లుల్లి పేస్టు వేగించి మటన్, నానిన పప్పులు, స్టాక్ వేసి మెత్తగా ఉడికించాలి. మరో కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కరివేపాకు, మునక్కాయ (రెండు అంగుళాల) ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు వేగించాలి. మునక్కాయలు మెత్తబడ్డాక ఉడికించిన మటన్, పప్పుల మిశ్రమాన్ని కలిపి తగినంత ఉప్పు వేసి రెండు నిమిషాల తర్వాత ఆమ్కా చూర్, పుదీనా, నెయ్యి కలిపి దించేయాలి. ఈ దాల్చా బిర్యాని రైస్‌తో ఎంతో రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత