అర్హతలు కలిగిన బహ్రెయిని ఉద్యోగార్ధులకు రేపు (బుధవారం) ఉద్యోగ మేళా
- October 10, 2017
మనామ: బుధవారం ( రేపు ) అక్టోబరు 11 వ తేదీన ఉత్తర గవర్నైట్ లోని బని జమ్రా కల్చరల్ అండ్ స్పోర్ట్స్ క్లబ్ హాలులో సాధారణ ఉద్యోగ మేళాను కార్మిక మరియు సాంఘిక అభివృద్ధి శాఖ మంత్రి జమిల్ బిన్ మహ్మద్ ఆలీ హుమాడేన్ ప్రారంభించనున్నారు.రెండు రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో పలు ప్రైవేటు రంగ సంస్థలు పాల్గొంటాయి. వివిధ విద్యా సంబంధిత అర్హతలు కలిగిన బహ్రెయిని ఉద్యోగార్ధులకు శిక్షణా అవకాశాలు మరియు ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఉద్యోగ అవకాశాలను వెతుక్కొనేందుకు వీలుగా అభ్యర్థి నేరుగా ఉద్యోగ అవకాశాలు మరియు పాల్గొనే సంస్థల ప్రతినిధులను ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల సమయంలో సంప్రదించవచ్చు. ఈ ఉద్యోగ మేళా ద్వారాకార్మిక మార్కెట్ లోకి ఉద్యోగ అవకాశాలను గణనీయంగా పెంచడానికి మరియు కొత్త జాతీయ సామర్థ్యాలను పంపుదలకు లేబర్ అండ్ సోషల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







