షార్జా లో చోటుచేసుకున్న మరో ఘోరం

- October 12, 2017 , by Maagulf
షార్జా లో చోటుచేసుకున్న మరో ఘోరం

షార్జా: 52 ఏళ్ళ భారతీయ వలసదారుడొకరు మువైలిహ్‌ ప్రాంతంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. షార్జాలో జరిగిన ఈ ఘటన గురించివివరిస్తూ, ఉరేసుకున్న వ్యక్తిని గుర్తించిన కొందరు పోలీసులకు సమాచారమిచ్చారని తెలిపారు. సమాచారం అందుకోగానే పోలీసులు, సీఐడీ అధికారులు, అంబులెన్స్‌ సంఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అయితే అప్పటికే ఉరివేసుకున్న వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఫోరెన్సిక్‌ పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్‌ లేబరేటరీకి తరలించారు. ఆ వ్యక్తి ఆత్మహత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు పోలీసులు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com