హైదరాబాద్ లో కొనసాగుతున్న భారీ వర్షాలు
- October 13, 2017
నగరంలో పలుచోట్ల భారీగా వర్షం పడుతోంది. కూకట్పల్లి, అమీర్‌పేట్, కోఠి, లింగంపల్లి, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, మాసాబ్ ట్యాంక్, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, విద్యానగర్, సికింద్రాబాద్, తార్నాక, ఉప్పల్, నాగోల్‌లో వర్షం కురుస్తోంది. దీంతో పలుచోట్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్‌కు అంతరాయం కలిగింది. నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. గతవారంగా పడుతున్న వర్షాలతో నగర వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్ ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







