'రాజరథం'లో ఆర్య.!
- October 14, 2017
అనూప్ భండారి తెరకెక్కిస్తున్న చిత్రం 'రాజరథం'. జాలీహిట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్‌రెడ్డి గొల్లపల్లి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిరూప్ భండారి, అవంతిక శెట్టి జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో తమిళ హీరో ఆర్య ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.
సైకిలింగ్ అంటే అమితాసక్తి చూపే ఆర్య బ్రిటన్‌లో నాలుగన్నర రోజుల్లో 1400 కిలోమీటర్ల దూరాన్ని సైకిల్‌పై చుట్టి వచ్చిన సంగతి తెలిసిందే. లండన్‌లో జరిగిన సైకిల్ ర్యాలీలో పాల్గొన్నప్పుడు అనూప్ భండారి ఆర్యకు ఫోన్ చేసి 'రాజరథం' కథ చెప్పారు. ఆర్య కథ విని, నటించడానికి ఓకే చెప్పారట. ఆర్య గతంలో నటించిన పాత్రలకు భిన్నంగా ఈ చిత్రంలో పాత్రని దర్శకుడు తీర్చిదిద్దినట్లు సమాచారం. ఆర్య పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో ఆయన ఓ గొడుగు పట్టుకుని, సీరియస్‌గా చూస్తూ కనిపించారు.
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







