కొత్త నోట్లపై స్వచ్ఛ భారత్ లోగో

- October 15, 2017 , by Maagulf
కొత్త నోట్లపై స్వచ్ఛ భారత్ లోగో

న్యూఢిల్లీ: కొత్తగా వచ్చిన 500, 2000 నోట్లను ఎప్పుడైనా జాగ్రత్తగా పరిశీలించారా? దానికి ఒకవైపు మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకం స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. అయితే ఈ లోగో ఎందుకు ముద్రించారు అని సమాచార హక్కు చట్టం కింద ఆర్బీఐకి ఓ ప్రశ్న ఎదురైంది. కానీ దానికి ఆర్బీఐ మాత్రం సమాధానం ఇవ్వలేదు. భద్రతా కారణాల వల్ల ఈ వివరాలను పంచుకోలేమని స్పష్టంచేసింది. ఆ లోగో ముద్రణకు సంబంధించి మార్గదర్శకాల కాపీని ఇవ్వడానికి కూడా ఆర్బీఐ నిరాకరించింది. పీటీఐ కరెస్పాండెంట్ ఆర్టీఐ కింద ఈ ప్రశ్న అడిగారు. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 8 (1) (ఎ) కింద బ్యాంక్ నోట్లపై ముద్రించిన సమాచారం పంచుకోవడం నుంచి మినహాయింపు ఉందని ఆర్బీఐ తెలిపింది. దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించే సమాచారాన్ని పంచుకోవ్సాలిన అవసరం లేదని ఈ సెక్షన్ స్పష్టంచేస్తున్నది. ఈ నోట్లకు ఓవైపు కళ్లద్దాలపై స్వచ్ఛ భారత్ లోగో ఉంటుంది. కరెన్సీ నోట్లపై వాణిజ్య ప్రకటనలు ముద్రించడానికి ఉన్న మార్గదర్శకాలకు సంబంధించిన కాపీ ఇవ్వమని అడగగా.. దీనికి ఆర్బీఐ నేరుగా సమాధానం ఇవ్వలేదు. కరెన్సీ నోట్ల ముద్రణకు సంబంధించి విధానాలను రూపొందించే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనమిక్ ఎఫైర్స్‌ను ఆర్టీఐ కింద ఈ ప్రశ్న వేశారు. ఈ దరఖాస్తును డీఈఏ ఆర్బీఐకి పంపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com