మళ్ళీ ఆ తప్పు చేయద్దంటున్న నివేదా థామస్
- October 15, 2017
నివేదా థామస్ అంటే కుర్రకారుకు అదో కిక్కు. ఈ ముద్దుగుమ్మ పేరు చెబితేనే ఖుషీ అయిపోతారు. ఇక పోస్టర్ చూస్తే.. ఫుల్లు హ్యాపీస్. అందులోనూ అమ్మడి పుట్టినరోజంటే.. కుర్రకారుకు పండగరోజే. అందుకే వాళ్లంతా... ఫుల్ స్పీడులో ఉన్న నివేదా బర్త్ డే ఎప్పుడా అని చూస్తే.. అక్టోబర్ 15 అని గూగుల్ లో కనిపించింది. ఇంకేముంది... వరుసపెట్టి విషెష్ చెప్పేశారు. అలా ఇలా కాదు.. సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టుల మీద పోస్టులు వెల్లువెత్తాయి. దీంతో ఉక్కిరిబిక్కిరైన నివేదాకు.. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే.. ఆమె బర్త్ డే అక్టోబర్ 15న కాదు. దీంతో తనపై ఇంత అభిమానం చూపించిన ఫ్యాన్స్ ను ఏమీ అనలేక.. వారి విషెష్ ను కాదనలేక.. ఓ ట్వీట్ ద్వారా అసలు స్టోరీ చెప్పింది. అక్టోబర్ 15న తన బర్త్ డే కాదని.. నవంబర్ 2న తన పుట్టినరోజని క్లారిటీ ఇచ్చింది. అంత టైం కేటాయించి మరీ తనకు శుభాకాంక్షలు చెప్పిన అభిమానులకు థ్యాంక్స్ చెప్పింది. కాకపోతే ఇదంతా గత ఏడాది జరిగింది. ఈసారి కూడా అలాంటి పొరపాటే జరుగుతుందని తన బర్త్ డే అక్టోబర్ 15న కాదని ట్విట్టర్ లో ముందుగానే గుర్తుచేయాల్సి వచ్చింది. సో నివేదా ఫ్యాన్స్.. అమ్మడి బర్త్ డే.. నవంబర్ 2. ఈ విషయాన్ని గూగుల్ లో కరెక్ట్ చేస్తే ఏ సమస్యా ఉండదు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







