కాల్పుల కలకలంతో వణికిన అమెరికా
- October 15, 2017
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. లాస్ వెగాస్ ఘటన మరువక ముందే.. వర్జీనియా స్టేట్ యూనివర్సిటీలో కాల్పుల ఘటన వెలుగు చూసింది. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 25 నిమిషాల సమయంలో ఓ దుండగుడు యూనివర్సిటీ క్యాంపస్ లోకి చొరబడి కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు అయ్యాయి.
మరోవైపు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాల్పుల ఘటనలో గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణాపాయం లేదని తెలిపారు. కాల్పులు జరిగిన వెంటనే పోలీసులు క్యాంపస్ మొత్తాన్ని స్వాధీనంలోకి తీసుకున్నారు. యూనివర్సిటీ గేట్లన్నీ మూసేశారు. కాల్పులు జరిగిన ప్రదేశం చుట్టుపక్కల అందర్నీ ఖాళీ చేయించారు. అటువైపు ఎవరూ రావొద్దని సామాజిక మాధ్యమాల ద్వారా హెచ్చరికలు చేశారు. కాల్పులు జరిపిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







