బంగ్లాదేశ్‌ తీరంలో పడవ మునక, 8మంది రొహింగ్యాల మృతి

- October 16, 2017 , by Maagulf
బంగ్లాదేశ్‌ తీరంలో పడవ మునక, 8మంది రొహింగ్యాల మృతి

అక్రమ వలసలు రావడానికి ప్రయత్నిస్తూ రోహింగ్యాలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ప్రాణాలు అరచేత పట్టుకొని వస్తున్న శరణార్థుల పడవ బోల్తా కొట్టిన ప్రమాదంలో 8మంది రొహింగ్యాలు మృతిచెందగా.. మరి కొంత మంది గల్లంతయ్యారు.

బర్మా నుంచి బంగాళాఖాతం మీదుగా బంగ్లాదేశ్‌కు అక్రమంగా వస్తుండగా పడవ నీట మునిగింది. ఒకే పడవలో పెద్ద ఎత్తున శరణార్థులు కూర్చోవడంతో.. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బంగ్లాదేశ్‌ తీరంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com