దీపావళి కోసం అక్షయ్ మరియు యువరాజ్ మాట్ల యుద్ధం

- October 16, 2017 , by Maagulf
దీపావళి కోసం అక్షయ్ మరియు యువరాజ్ మాట్ల యుద్ధం

దీపావళి కి 500, 1000 ఇలా వేలకు వేలు ఖర్చు పెట్టి దీపావళి బాంబులు కొనే బదులు ఓ పేదవాడికి కడుపు నింపండి అని తెగ ప్రచారం చేస్తున్న వారికి బాలీవుడ్ స్టార్ హీరో మంచితనం.. మానవత్వం నింపుకొన్న మనిషి అక్షయ్ కుమార్ ఓ రేంజ్ లో సమాధానం చెప్పారు.. పేదవాడి కడుపు నింపండి అనే మాట మీకు హిందువుల పండగలు రాగానే గుర్తుకు వస్తాయా..!! మరి అదే విషయం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ విషయం లో ఎందుకు గుర్తుకు రాదు.. అప్పుడు దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా బాణా సంచాకే కొన్ని వేల కోట్ల రూపాయలను తగల పెడుతున్నారు కదా..!! అపుడు పేద వాడి ఆకలి గురించి అడగరేం..! రాజకీయ నాయకులు, పార్టీలు అధికారం లోకి వచ్చినప్పుడు లక్షలాది రూపాయల బాంబులు కాలుస్తారు. కటౌట్ కి పాలాభిషేకం చేస్తారు. మరి అప్పుడు గుర్తుకు రాదా ...! పేదవాడి ఆకలి.. అదే పాలతో దేవుడికి అభిషేకం చేసినప్పుడు మాత్రం పాలను వృధా చేస్తున్నారు పేడోది ఆకలి అంటూ నినాదాలు ఇస్తూ.. లెక్చర్ ఇస్తారు.. మరి అదే దేవాలయంలో జరుగుతున్న అన్నదానం వంటి కార్యక్రమం గుర్తుకు రావా..! కొన్ని వేల మందికి ప్రతీ పుణ్యక్షేత్రాల్లో నిత్యం ఆన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఇవన్నీ మీకు కనిపించవా..!! పేదోళ్లు అంటూ నీలిగే ప్రభుద్ధులు ఎప్పుడైనా, ఎక్కడైనా పేదోడికి కందుపు నిండా అన్నం పెట్టారా...!! ఒక్క రూపాయి దానం ధర్మం చేశారా..!! కానీ బార్ కెళ్ళి వందలకు వందలు ఖర్చు పెట్టి బీరు తాగుతారు. ఇక మీదట హిందూ ధర్మాన్ని కించరిచే విధంగా మాట్లాడే వారికి ఈ సందేశాన్ని అందజేవలసిందిగా నా మనవి... దీపావళి బాణాసంచాకు 500 రూ. లు కాల్చకుండా దానం చెయ్యమని ఉచిత సలహా ఇస్తున్న మిత్రులారా... ఐదు వందల కోసం ఏడాది ఒకసారి వచ్చే దీపావళి జరుపుకోవద్దా..!! అయితే మొదట మీరు ఇంటర్నెట్ కనెక్షన్ తొలగించుకోండి.. టీవీ కేబుల్ కనెక్షన్ ను తొలగించుకొని ఆ డబ్బుని పేద వారి ఆకలి తీర్చడానికి ఉపయోగించండి అని అక్షయ్ తెలిపారు.కాగా ఇండియన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ దీపావళి కి బాణాసంచా బదులు ఆ డబ్బులను పేదవారికి పంచమన్న సంగతి విధితమే..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com