గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వెరీ హాట్ గా శ్రీముఖి

- October 16, 2017 , by Maagulf
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వెరీ హాట్ గా శ్రీముఖి

యాంకర్ శ్రీముఖి తన క్యూట్ యాంకరింగ్ తో తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సినిమాల్లో కూడా అడపాదడపా ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తుంది. బుల్లితెర మీద తనదైన ముద్ర వేసుకున్న శ్రీముఖి సిల్వర్ స్క్రీన్ పై ఆ ఇమేజ్ కోసం బాగా ప్రయత్నాలు చేస్తుంది. ఇక అందుకే అమ్మడు ఓ క్రేజీ మూవీలో నటించేస్తుంది.
నటుడు, రచయిత హర్షవర్ధన్ డైరక్షన్ లో వస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో శ్రీముఖి హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో ఆమె చాలా హాట్ గా ఉంది. శ్రీముఖికి ఎందుకు ఈ సరదా బుల్లితెర మీద ఉన్న ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నం చేయకుండా ఎందుకు ఇంత దిగజారుడు సినిమాలు అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక కొందరు శ్రీముఖి చేసే ఓవర్ యాక్షన్ అయితే శ్రీముఖి ఈ పాత్ర పర్ఫెక్ట్ అంటున్నారు. ఏది ఏమైనా ప్రేక్షకులు ఎలాగైనా రిసీవ్ చేసుకోవాలన్న ఆలోచనతో శ్రీముఖి ఇంత బోల్డ్ అటెంప్ట్ చేసింది. అమ్మడు హాఫ్ సారీ లో అందాలు అదరగొడుతుందని చెప్పొచ్చు. శ్రీముఖిలో హాట్ యాంగిల్ చూడాలని కోరుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
సినిమా టీజర్ అయితే ఏదో విషయం ఉన్నట్టు ఉంది. ఇక సినిమాలో మెయిన్ వర్మను హైలెట్ చేసినట్టుగా ఉన్నాడు. వర్మ పాత్రకు ఓ ఆర్టిస్టుని కూడా పెట్టారు. మొత్తానికి హర్షవర్ధన్ చేస్తున్నా ఈ తొలి దర్శకత్వపు ప్రయత్నం ఎన్వరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com