గురకకు చెక్ పెట్టాలా? వేడి పాలల్లో పసుపు పొడిని వేసి?
- October 17, 2017
వెల్లకిలా నిద్రిస్తూ గురకపెడితే సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. నోరు మూసుకొని గురకపెడితే నాలుకలో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. నోరు తెరచి గురకపెడితే గొంతులోని మృదువైన కణజాల సమస్యగా గుర్తించాలి. వెల్లకిలా పడుకుని గురకపెడితే ప్రధాన సమస్యగా పరిగణించాలి. అయితే ఎలా నిద్రించినా గురక వస్తుంటే దాన్ని తీవ్ర సమస్యగా గుర్తించాలని వారు హెచ్చరిస్తున్నారు.
గురక సమస్య నుంచి దూరం కావాలంటే.. అర టీ స్పూన్ యాలకుల చూర్ణం ఒక గ్లాసు వేడి నీటిలో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే చక్కటి ఫలితం లభిస్తుంది. రెండు టీ స్పూన్ల పసుపు పొడిని కప్పు వేడి పాలల్లో కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగి పడుకుంటే గురక తగ్గుతుంది. అలాగే అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, అర టీ స్పూన్ తేనె కలిపి రాత్రి నిద్రపోయే ముందు తాగితే గురక తగ్గుతుంది.
మరిగే నీటిలో నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఆయిల్ వేసి తలకు ముసుగు పెట్టి రాత్రి నిద్రపోయే ముందు పది నిమిషాల పాటు పీల్చితే గురక తగ్గిపోతుంది. ఆవు నెయ్యిని రోజూ కొద్దిగా వేడి చేసి కరిగించి రెండు చుక్కల చొప్పున రెండు ముక్కు రంధ్రాలలో పోసి పీల్చుతుంటే తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







