అంతర్జాతీయ నగదు బదిలీ, మోసాల ముఠాని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అరెస్టు
- October 18, 2017
కువైట్: అంతర్జాతీయ నగదు బదిలీ ( ఇంటర్నేషనల్ మనీ లాండరింగ్ ) మోసంతో సంబంధాలు ఉన్న ముఠా సభ్యులను అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఒక ప్రత్యేక విభాగం అరెస్టు చేసినట్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. వీరి వద్ద సౌత్ ఆఫ్రికన్ మరియు నైజీరియా పాస్‌పోర్ట్ లను స్వాధీనం చేసుకొన్నారు. సోషల్ మీడియా ద్వారా పలువురికి ఎరవేసి వారి వద్ద నుంచి డబ్బులను అపహరించడంలో అత్యంత నేర్పరులు. బాధితుల నుంచి నగదుని వివిధ పద్ధతులలో నకిలీ అకౌంట్లను ఉపయోగించి డబ్బు బదిలీ చేయమని వత్తిడి చేసేవారు. వీరి చేష్టలపై అనుమానం కల్గిన కొందరు పౌరులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో నిందితుల చర్యల గూర్చి విచారణ చేసి పోలీసులు ఆ ముఠాను అరెస్టు చేశారు. విలువైన సమాచారం అందించిన వారందరికీ కృతజ్ఞతలు పబ్లిక్ రిలేషన్స్ విభాగం తెలిపింది. పౌరులు ఈ తరహా మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







