ఒడిషా,ఉత్తరాంధ్రకు భారీ నుంచి అతి భారీ వర్షాలు
- October 19, 2017
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశగా 340 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఇవాళ ఒడిషాలోని పూరి-చాంద్బలిల మధ్య తీరం దాటనుంది.
ప్రస్తుత వాయుగుండం ప్రభావం ఉత్తర కోస్తాపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఒడిషా ఉత్తర కోస్తాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగతా ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురవనున్నాయి. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. అన్ని ప్రధాన పోర్టుల్లో ఒకటో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకెళ్లొద్దని హెచ్చరించారు.
అటు..వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లావ్యాప్తంగా చిరుజల్లులు కురుస్తున్నాయి. భారీ వర్ష సూచనతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంతంలోని మత్స్యకారుల్ని అప్రమత్తం చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో.. పార్వతీపురం ఆర్డీవో కార్యాలయంలో అంట్రోల్ రూంలను ఏర్పాటు చేసింది.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







