అవినీతి కేసులో నవాజ్‌ షరీఫ్‌, కుమార్తె, అల్లుడిపై నేరాభియోగం

- October 20, 2017 , by Maagulf
అవినీతి కేసులో నవాజ్‌ షరీఫ్‌, కుమార్తె, అల్లుడిపై నేరాభియోగం

పదవీచ్యుతుడైన పాకిస్థాన్‌ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌, ఆయన కుమార్తె, అల్లుడు అవినీతికి పాల్పడ్డారంటూ సంబంధిత న్యాయస్థానం శుక్రవారం నేరాభియోగం చేసింది. లండన్‌లోని 'అవెన్‌ఫీల్డ్‌ ప్రాపర్టీస్‌'కు సంబంధించిన అవినీతి కేసులో వీరు ముగ్గురిపైనా కేసులు నమోదైన విషయం గమనార్హం. నవాజ్‌ షరీఫ్‌పై 'జాతీయ జవాబుదారి బ్యూరో'(ఎన్‌ఏబీ) సెప్టెంబరులో మూడుకేసులు నమోదు చేసింది. కాగా, అవెన్‌ఫీల్డ్‌ ప్రాపర్టీస్‌ కేసులో షరీఫ్‌, ఆయన కుమార్తె మర్యాం నవాజ్‌, అల్లుడు కెప్టెన్‌ (విశ్రాంత)మహమ్మద్‌ సఫ్దర్‌లపై సదరు కోర్టు నేరాభియోగం చేసింది. గొంతుక్యాన్సర్‌తో ఇప్పటిదాకా మూడు శస్త్రచికిత్సలు చేయించుకుని అనారోగ్యంతో ఉన భార్య కుల్‌సుమ్‌తో వెంట షరీఫ్‌ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. ఈ కేసు నేపథ్యంలో ఆయన లండన్‌లో మీడియాతో మాట్లాడుతూ....తనపై నేరాభియోగం మోపడాన్ని ప్రస్తావిస్తూ న్యాయాన్ని చంపేశారంటూ ఆరోపించారు. ఈ నెల 26న జరిగే తదుపరి విచారణ సమయానికి తాను తిరిగి వస్తానని కూడా నవాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. బహుశా ఆయన ఆదివారం పాక్‌కు వస్తారని అనుకుంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com