ఆసియా దేశాల పర్యటనకు బయల్దేరుతున్న ట్రంప్
- October 21, 2017
ఉత్తరకొరియా నియంత కింగ్ జాంగ్ ఉన్ మొండితనం పట్ల అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. అమెరికాను బూడిద చేస్తానంటూ అణు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తున్న కిమ్‌ను నియంత్రించే మార్గాల కోసం అన్వేషిస్తోంది.
ఎన్ని హెచ్చరికలు చేసినా కిమ్ పెడచెవిన పెడుతుండడంతో అమెరికా ఉన్నాతాధికారులు ఆందోళన చెందుతున్నారు. దౌత్యపరమైన చర్చలు కొనసాగిద్దామని ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో ఉత్తరకొరియా అధినేత కిమ్‌ను దారిలోపెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక అడుగువేస్తున్నారు. అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఆసియా పర్యటనకు బయలుదేరుతున్నారు.
చైనా, జపాన్, దక్షిణకొరియా, వియత్నాం, ఫిలిప్పైన్స్ దేశాలలో ట్రంప్ పర్యటించనున్నారు. ఆయన ఆసియా దేశాల పర్యటన ప్రధాన అజెండా ఉత్తరకొరియా నియంత కిమ్ ను దారిలో పెట్టడమే.
ఉత్తరకొరియాను నియంత్రించే చర్యల్లో భాగంగా ట్రంప్ చైనాపై ఒత్తిడి తీసుకురానున్నారని సమాచారం. ఈమేరకు వైట్‌హౌస్ అధికారులు కూడా తగిన ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఉత్తరకొరియాతో ఉన్న వివాదాన్ని చైనా తగ్గించగలదని ట్రంప్ భావిస్తున్నారు. ట్రంప్ ఆసియా దేశాల పర్యటన వెనుకున్న ఉద్దేశం కూడా ఇదేనని స్పష్టమవుతోంది. నవంబర్ 3న ట్రంప్ పర్యటన ప్రారంభం కానుందని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







