ఇండియన్‌ నేవల్‌ అధికారిని కలిసిన మస్కట్‌ డిప్యూటీ గవర్నర్‌

- October 26, 2017 , by Maagulf
ఇండియన్‌ నేవల్‌ అధికారిని కలిసిన మస్కట్‌ డిప్యూటీ గవర్నర్‌

మస్కట్‌: మస్కట్‌ డిప్యూటీ గవర్నర్‌ సయ్యిద్‌ సైద్‌ బిన్‌ ఇహ్రమీమ్‌ అల్‌ ముసైది, ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ షిప్‌ సమర్థ్‌లో వచ్చిన కమాండింగ్‌ ఆఫీసర్‌కి తన కార్యాలయంలో స్వాగతం పలికారు. ఇరు దేశాలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ సందర్భంగా ఇరువురి మధ్యా చర్చ జరిగింది. గవర్నరేట్‌ ఆఫ్‌ మస్కట్‌ గురించి పలు విషయాల్ని భారత నేవీ అధికారితో చర్చించారు సయ్యిద్‌ సైద్‌ బిన్‌ ఇబ్రహీమ్‌ బుసైది. మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ కట్టడాలు, చారిత్రక ప్రదేశాల గురించి బుసైదీ ద్వారా తెలుసుకున్న ఇండియన్‌ నేవీ అధికారి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com