అనివార్య కారణాలు వలన మల్లి వాయిదా పడిన విజయ్ అదిరింది

- October 27, 2017 , by Maagulf
అనివార్య కారణాలు వలన మల్లి వాయిదా పడిన విజయ్ అదిరింది

దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన 'అదిరింది' మూవీ తెలుగులో విడుదలకు గ్రహణం వీడడం లేదు. ఇప్పటికే పలుమార్లు విడుదలకు సిద్ధమై చివరి క్షణంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తోంది. తాజాగా సెన్సార్ పూర్తికాలేదంటూ ఇవాళ విడుదలవ్వాల్సిన మూవీకి మరోసారి బ్రేక్ పడింది.

'మెర్సల్‌' మూవీ తెలుగు వెర్షన్‌ 'అదిరింది'కి బాలారిష్టాలు తప్పడంలేదు. ఇప్పటికే ఈ సినిమా పలు సార్లు విడుదలకు సిద్ధమై వాయిదా పడింది. నిజానికి తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదల చేయాల్సి ఉండగా డబ్బింగ్‌ సమస్యతో విడుదల కాలేదు. అయితే తాజాగా చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయాలని నిర్ణయించినా బ్రేక్ పడింది. సినిమాకు సెన్సార్‌ పూర్తి కాలేదని, దీంతో విడుదల చేయట్లేదని చిత్ర నిర్మాణ సంస్థ నార్త్‌స్టార్‌..., సోషల్‌ మీడియాలో ప్రకటించింది. త్వరలోనే విడుదల తేదీలను ప్రకటిస్తామని నార్త్ స్టార్ ఎంటర్ టైన్‌మెంట్ తెలిపింది. సెన్సార్‌లో భాగంగా తెలుగు వెర్షన్‌లో జీఎస్టీ పైన ఉన్న డైలాగ్స్ తొలగించనున్నట్లు తెలిసింది. జీఎస్టీపై డైలాగ్‌ వచ్చే సమయంలో ఆడియోను తొలగించనున్నారు. ఆ సీన్లే పూర్తిగా కట్ చేసే అవకాశం ఉంది. తమిళంలో ఇప్పటికే ఈచిత్రంపై వివాదాలు నడుస్తున్నాయి.

‘మెర్సల్’తో పాటు తెలుగు వెర్షన్‌ను కూడా ఈ నెల 18న రిలీజ్ కావాలి. కానీ జరగలేదు. అప్పటి నుంచి త్వరలో సినిమా వస్తోందని చెప్తున్నారు తప్ప తేదీ వెల్లడించలేదు. జాతీయ స్థాయిలో వివాదాస్పదమైన ఈ సినిమాకు తెలుగులో మంచి హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే ఓపెనింగ్స్ కోసం భయపడుతున్న బయ్యర్లు.. మరోసారి వాయిదాతో తలపట్టుకుంటున్నారు. ‘మెర్సల్’ తెలుగు హక్కులను పవన్ కళ్యాణ్ సన్నిహితుడు శరద్ మరార్ కొనుగోలు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com