నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: 14 మంది మృతి
- October 28, 2017
నేపాల్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి త్రిశూలీ నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రాజ్‌బిరాజ్ నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సు ఘట్‌బేసీ సమీపంలోని ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. విషయం తెలుసుకున్నఅధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటి వరకు 14 మృతదేహాలను వెలికి తీసినట్లు ఓ అధికారి తెలిపారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









