సీన్ లోకి దిగిన లక్ష్మీ పార్వతి

- October 29, 2017 , by Maagulf
సీన్ లోకి దిగిన లక్ష్మీ పార్వతి

'లక్ష్మీస్ ఎన్టీఆర్' పేరుతో త్వరలో వర్మ ఓ సినిమా తీసేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ మార్కెట్‌లలో హాట్ టాపిక్‌గా మారిన ఈ బయోపిక్ గురించి రోజూ ఏదో ఒక పోస్ట్‌తో వర్మ సెన్సేషన్ అవుతూనే ఉన్నారు. ఈ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంపై ఎవరైనా కామెంట్ చేస్తే వెంటనే కౌంటర్ వేస్తూ వర్మ పోస్ట్‌లు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇదంతా వర్మ వెనుక వైఎస్ఆర్‌సీపీ ఉండి, చేయిస్తుందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. ఈ చిత్రాన్ని వైఎస్ఆర్‌సీపీ నేత రాకేష్ రెడ్డి నిర్మించనుండటంతో ఇది మరింత బలపడింది. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతికి తెలిసే ఇదంతా జరుగుతోందనే ప్రచారం కూడా ఉంది. అయితే తాజాగా లక్ష్మీపార్వతి ఈ బయోపిక్‌పై స్పందిస్తూ వర్మకి వార్నింగ్ ఇచ్చినంత పనిచేశారు.
వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాని తీయడంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, చరిత్రకు తెలియని విషయాలను చూపిస్తానని చెబుతున్నాడు కాబట్టే తాను ఈ సినిమాకి అంగీకరిస్తున్నానని లక్ష్మీపార్వతి తెలిపారు. అయితే స్టోరీపై ఇంతవరకు తనని వర్మ కలవలేదని, నిజంగా చరిత్రకు తెలియకుండా మరుగునపడిన విషయాలను చూపిస్తే సంతోషిస్తానని ఆమె తెలిపారు. అలా కాకుండా తన ఆత్మగౌరవానికి ఆటంకం కలిగించేలా సినిమా తీస్తే మాత్రం, సినిమాని ఆపేయడానికి ఎంత దూరమైనా వెళతానని, వర్మ తనలోని పాత లక్ష్మీపార్వతిని చూస్తాడని... ఆమె హెచ్చరికలు జారీ చేశారు. ఈ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' గురించి మాట్లాడిన అందరికీ కౌంటర్లు వేస్తున్న వర్మ.. ఈ హెచ్చరికలకు ఎలా స్పందిస్తాడో..మరి?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com