ప్రముఖ సినీనటికి ఆపరేషన్
- October 29, 2017
ప్రముఖ సినీనటి, ఏఐసీసీ అధికార ప్రతినిధి ఖష్బూకు నవంబర్ నాలుగో తేదీన ఆపరేషన్ జరుగనుంది. ఇటీవల ఖుష్బూ ఇంటిలో జారిపడటంతో ఆమె మోకాలికి దెబ్బ తగలింది. ఆ గాయానికి చికిత్స చేయించుకోగా ఆమె కోలుకున్నారు. అయితే ఉన్నట్టుండి ఆమెకు కడుపు నొప్పి రావటంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఖుష్బూ కడుపులో చిన్న కణితి ఉన్నట్లు కనుగొన్నారు. ఆ కణితిని తొలగించేందుకు నవంబర్ నాలుగన తాను ఆపరేషన్ చేసుకోనున్నట్లు ఖుష్బూ తెలిపారు. ఈ కారణంగా రెండు వారాలపాటు తాను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల్సి ఉండటంతో నవంబర్ నాలుగు, ఎనిమిది, 17 తేదీలలో జరిగే ఇందిరా శతజయంతి వేడుకల సభలకు తాను హాజరుకాలేనని ఆమె పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!